అతిపెద్ద ఏకశిలా గణపతి విగ్రహం
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా వినాయక రాతివిగ్రహం ఇది. నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంది.
ఆవంచ గణపతి విగ్రహం క్రీ.శ.10-12 శతాబ్దాల కాలం నాటిదని పురాతత్వ శాఖ నిర్ధారించి చెప్పింది. ఈ విగ్రహాన్ని కాకతీయులకు సామంతులుగా వ్యవహరించిన కందూరు చోళులు నిర్మించినట్లు కనుగొన్నారు. ఆచంట గ్రామంలో శివపార్వతులు, మహిషాసురమర్ధిని, గణపతి, భైరవుడు, నంది విగ్రహాలు కూడా బయటపడ్డాయి. వాటన్నిటినీ జిల్లాలో పిల్లలమర్రిలోని మ్యూజియానికి తరలించి భద్రపరిచారు. కానీ ఈ భారీ గణపతి విగ్రహాన్ని మాత్రం అలాగే వదిలేశారు.
0 Comments