Ad Code

కుండలినీశక్తి

కుండలినీశక్తి



దీనిని సాధించడానికి చాలామంది ఎందరో గురువులను ఆశ్రయించడం జరుగుతుంది. కానీ ఈ శక్తిని సాధించలేక ఎంత ప్రయత్నించినా చివరివరకూ వచ్చి ఆగిపోవడం జరుగుతుంది.

ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు ఎంచుకున్న గురువు నిజమైన విద్య సాధకుడు కానపుడు, మీ వద్ధ కుండలినీశక్తి యొక్క తీవ్రతను తట్టుకునే శక్తి లేనపుడు మాత్రమే అలా జరుగుతుంది.

కుండలినీశక్తిని నిద్రలేపిన వారికి కొన్ని మానవాతీత శక్తులు లభిస్తాయి. అలాంటి శక్తిని పొందిన వారు ఉత్తములైతే ఫర్వాలేదు. కానీ లోక కంఠకుల వద్ధ ఈ శక్తి ఉంటే చాలా ప్రమాదం.

అందువల్లనే మన పురాణ తంత్ర గురువులు కుండలినీశక్తి ని నిద్రలేపే సిద్ధ విద్య విధానాలను అత్యంత రహస్యంగా ఉంచారు.

ఈ శక్తిని అందరికీ అందించడం జరగదు. దానికి మీ మనస్సు చాలా నిర్మలమైన ఎటువంటి కల్మషం లేనిదయి ఉంది ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్థత్వం ఉన్నవారు మాత్రమే కుండలినీశక్తి సాధనకు అర్హులు.

కుండలినీశక్తి ని సర్పముతో పోల్చారు మన తంత్రగురువులు. కనుక ఈ కుండలినీ సర్పమునకు కూడా ఇతర సర్పములకు ఉన్నట్లే చేతన, అచేతన అనే రెండు స్థితులు ఉన్నాయి.

కుండలినీశక్తి ని తమ ఇష్టానుసారం మాత్రమే నడిపించే వారు మహాపురుషులు అవుతారు. కుండలినీశక్తి కి లోబడి నడుచువారు సామాన్యమానవులు. ఈ శక్తిని తమ అదుపాజ్ఙలలో పెట్టి తమ ఇష్టానుసారంగా ఉపయోగించే వారే మహా సిద్ధులు.





Post a Comment

0 Comments