Ad Code

కుండలినీ ఎప్పుడెప్పుడు మేలుకుంటుంది

కుండలినీ ఎప్పుడెప్పుడు మేలుకుంటుంది



విపరీతంగా కోపం భయం కలిగి నప్పుడు నీ శక్తి పదిరేట్లు అధికం అవుతుంది ఎక్కడిది నీకు ఆ శక్తి ఆ సమయంలో ఆవేశంతో కుండలినీ మేలుకుంటుంది, అదే కుండలినీ ధ్యానంలో మేలుకుంటే నీలో శక్తి పెరుగుతుంది. కోపముతో ఎంత బరువైన ఎత్తగలరు ఎవరినైనా కొట్టగలరు ఆ నిముషంలో నీలో ఉన్న ఎస్ట్రనల్ ఎనర్జీ బయటకు వస్తుంది , అలాగే ప్రాణ భయంతో ఎంత దూరమైన పరిగేడతారు లేదు ఎంత ఎత్తుకైనా ఎక్కి తప్పించుకుంటారు సాధారణ స్థితిలో ఆ వ్యక్తి కి ఆ శక్తి ఉండదు. అయితే అలా నిన్ను కష్ట పెట్టినప్పుడు ఆవేశంతో మేలుకునే కుండలినీ ఎక్కువ సేపు సహస్త్రరం లో నిలువదు వెంటనే పడిపోతుంది. అదే కుండలినీ ధ్యానం లో నెమ్మదిగా సాధన ద్వారా సహస్త్రరం చేరుకుంటే అధిక సమయం నిలువ గలుగుతుంది అదే నీలో శక్తిగా మారుతుంది దివ్య దృష్టి, టేలిపతి, అస్ట్రోల్ జర్నీ ఇవన్నీ ఆ స్థాయిలో నే సాధ్యం అవుతుంది. యోగాసనాలు ద్వారా , ప్రాణాయామం ద్వారా , సహజ రాజయోగం ఈ మూడు విధానాలలో కూడా. కుండలినీ జాగృతం అవుతుంది ,ఏకదాటిక కొన్ని మంత్రాలు పదే పదే జపించడం ద్వారా ఆ ఏకాగ్రతకు కూడా వారిలో చక్రాలు ప్రచోదనం కలుగుతుంది. ముంఖ్యంగా జపం వల్ల నాడీ వ్యవస్థ లోని లోపాలు సరిచేయబడతుంది. ఎందుకంటే దైవనామ మంత్రం రూపంలో ఉన్నవన్నీ ప్రకృతిలో ని విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే ఫార్ములాలు. ఈ బీజాలు మంత్రాలు సృష్టి ఆరంభం అయిన ఓం శబ్దం నుండి ఉద్భవించినవే అందుకే ఆ శబ్దం మనలో శబ్ద రూపంలో ఉన్న పరా నుండి వైఖరి రూపం వరకు నాలుగు దశలలో మనలో నాట్యం చేస్తు వెలువడే వాక్కు రూపంలో ఉన్న అమ్మవారు ఆ శబ్దంలోనే ఉపాసించబడుతూ ఉంటుంది. మనలో కుండలినీ రూపంలో సహస్త్రరం చేరుకుని జీవాత్మ ప్రమాత్మలో కలిసిపోతుంది.





Post a Comment

0 Comments